సాయం చేస్తే కొట్టి చంపేశారు…

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలో జాస్మిన్‌ (19) అనే అమ్మాయికి వాళ్ల తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఆ సంబంధం ఆ అమ్మాయికి ఇష్టంలేదు. ఆ విషయాన్నే వాళ్ల అన్న మిత్రులు వేములపల్లి సాయి, పవన్‌ కుమార్‌లకు మెసేజ్‌ పెట్టింది. ఇష్టంలేని పెళ్లి చేసుకోవడం నచ్చక ఆత్మహత్య చేసుకుంటున్నానని వాళ్లకు మెసేజ్‌ పెట్టింది. కంగారుపడ్డ మిత్రులు వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులను సంప్రదించారు. వాళ్లు ఊరిలో లేరు. ఇంటిలో అమ్మాయి ఒక్కతే ఉంది. వీళ్లు వెంటనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి చూశారు. అప్పటికే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయాన్ని పక్కింటివాళ్లకు చెప్పారు.

దాంతో ఆ ఏరియా వాళ్లంతా గుమికూడారు. వీళ్లే ఆ అమ్మాయిపై లైంగిక దాడిచేసి చంపేసి కట్టుకథలు చెబుతున్నారని భావించి వాళ్ల ఇద్దరిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. విషయం తెలిసి పోలీసులు వచ్చి వాళ్లను విడిపించి ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా వేములపల్లి సాయి మృతిచెందారు.

సాయి మృతిచెందడానికి పోలీసులు కూడా కారణమేనని మృతుడి తల్లి ఆరోపిస్తోంది. పోలీసులు మాత్రం మా తప్పు ఏమీ లేదని చెబుతూ మృతురాలి కుటుంబీకులపై, కాలనీ వాసులు కొందరిపై హత్యకేసు నమోదుచేశారు.

Click on Image to Read:

swaroopanandendra-saraswati

sania-mirza

gottipati-ravikumar

ramya

handriniva

roja

jairam-ramesh

pattipati-pullarao

kcr

kovur-tdp-mla-polam-reddy-s

sharma

jv-ramudu

galla-arjun-jayadev

tdp-vijaya-jyothi

vijayawada-flyover

babu-movie