డేటింగా..అబ్బే అదేమి లేదే..!

కెరీర్ ప్రారంభంలో  బొద్దుగుమ్మ అనిపించుకున్న ప‌రిణితి చోప్రా.. బరువు త‌గ్గి..  నాజుకు భామ అనిపించుకుంటుంది. డిష్యుం చిత్రంలో  ఒక స్పెషల్ సాంగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌..   ఇది సూప‌ర్ హిట్ కావ‌డంతో..   వ‌ర‌స ఆఫ‌ర్స్ తో  దూసుకెళ్తుంది. ఈ ముద్దుగుమ్మ‌ను డేటింగ్ గురించి అడిగితే..అబ్బే అటువంటింది ఏమి లేదే అంటోంది.
‘ప్రేమ విషయంలో ఓపెన్‌గానే ఉంటాను. నా జీవితంలో ఎవరూ లేరు. చాలారోజుల నుంచి ఒంటరిగానే ఉంటున్నా. కానీ అలా ఎందుకు ఉండాలని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. చాలావరకు మేము(నటీనటులు) సహనటులు.. దర్శకులు.. నిర్మాతలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరితోనే టచ్‌లో ఉంటా. ఎక్కువ మందిని కలుసుకునే అవకాశం ఉండదు. నేను చాలా సింపుల్‌గా.. నిజాయతీగా ఉంటాను. మనసులో ఏదీ దాచుకోను. అలాగే నాకు కావాల్సిన వాడు కూడా నాలానే ఉండాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. సో ..  ప‌రిణితో చోప్రాకు కాబోయో వాడు నిజాయితీగా ఉండాల‌న్న‌మాట‌.  అస‌లు డేటింగేచేయ‌డం లేదంటే  న‌మ్మోచ్చు అంటారా..?