లోక్‌స‌భ‌లో రాహుల్ నిద్ర‌పై ప్ర‌తిప‌క్షాల ఫైర్‌

దేశంలో ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై బుధ‌వారం లోక్‌స‌భ‌లో వాడివేడీగా చ‌ర్చ జ‌రుగుతుండగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ నిద్ర‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డ్డాయి. ఒక వైపు చ‌ర్చ‌తో  స‌భ్యుల మ‌ధ్య వాదోప‌వాదాలు జ‌రుగుతుండ‌గా, రాహుల్ మాత్రం నిద్ర‌లోకి జారుకోవ‌డం ప‌లువురు స‌భ్యుల‌ను విస్మ‌యానికి గురి చేసింది. రాహుల్ కునుకు కాంగ్రెస్ పార్టీని ఇర‌కాటంలోకి నెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ద‌ళితుల‌పై ఏ మాత్రం  ప్రేమ‌లేద‌ని అందుకే రాహుల్ హాయిగా నిద్ర‌పోయార‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి మండిప‌డ్డారు.
ఈ సంఘ‌ట‌న‌పై బీజేపీ నేత‌లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాహుల్ ప‌దేళ్లు నిద్ర పోయార‌ని, ఆ నిద్ర ఆయ‌న‌కు స‌రిపోలేదా? అని ఆ నేత‌లు సెటైర్లు విసిరారు. మ‌రో వైపు త‌మ యువ‌నేత‌ను  ఎలా స‌మ‌ర్థించుకోవాలో తెలియ‌క కాంగ్రెస్ నేత‌లు స‌త‌మ‌త మ‌య్యారు. రాహుల్ సెల్‌ఫోన్‌లో అప్ డేట్స్ చూసుకున్నార‌ని, ఆయ‌న నిద్ర‌పోలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. రాహుల్ గాంధీ దేశం కోసం అహ‌ర్నిశలు ప‌ని చేస్తున్నార‌ని ఆయ‌న కొద్ది సేపు రిలాక్స్ అయ్యార‌ని, దానినే ప్ర‌తిప‌క్ష నాయ‌కులు త‌ప్పు ప‌డితే ఎలా అని  కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల రాహుల్ ప‌ని తీరుపై అనేక విమర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న అధికార ప‌క్షాన్ని ధీటుగా ఎదుర్కొవ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.