ఏపీలో ముడుపులపై అమెరికా కంపెనీ తీవ్ర ఆరోపణలు…

ఏపీలో అవినీతి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటీవల కేంద్ర సంస్థ ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని తేల్చగా… తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ సన్ ఎడిషన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఏపీ ప్రభుత్వ పెద్దలతో ఏగలేమంటూ ఏకంగా రూ. 15కోట్ల డిపాజిట్ ను వదులుకుంది. కాంట్రాక్టును రద్దు చేసుకుంది. ఏపీలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్‌ ఎడిషన్ ముందుకొచ్చింది. టెండర్లు కూడా దక్కించుకుంది. అయితే ఇతర అనుమతుల విషయంలో కోట్లాది రూపాయల లంచాలను ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేయడంతో కంపెనీ కంగుతింది. వెంటనే కాంట్రాక్టును రద్దు చేసుకుంది.

సన్‌ ఎడిషన్ లాంటి సంస్థ వెనక్కు వెళ్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించిన ఏపీ విద్యుత్ శాఖ అధికారులు సన్ఎడిషన్ కంపెనీ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ పర్యటనల్లో మీ ముఖ్యమంత్రి అనుమతులన్నీ ఉచితంగా రోజుల వ్యవధిలోనే ఇచ్చేస్తామంటున్నారు…. కానీ గ్రౌండ్ లెవల్‌లో చూస్తే  అదే ప్రభుత్వ పెద్దలు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నారని కంపెనీ ప్రతినిధులు ధ్వజమెత్తినట్టు తెలుస్తోంది. అలాంటి వాతావరణం ఉన్న చోట తాము వ్యాపారం చేయదలుచుకోలేదని సన్ ఎడిషన్‌ ప్రతినిధులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

కంపెనీ ప్రతినిధులు ఎంతగా విసుగుచెందారో తెలుసుకునేందుకు మరో ఘటన కూడా అద్దం పడుతోంది. సన్‌ ఎడిషన్ టెండర్ల సమయంలో ఇచ్చిన రూ. 15కోట్ల బ్యాంకు గ్యారెంటీని కూడా ఏపీ ప్రభుత్వానికి వదిలేసింది. ఇలా డిపాజిట్ మొత్తాన్ని కూడా సన్ ఎడిషన్ కంపెనీ వదులుకుందంటే  కంపెనీలను ఇక్కడి పెద్దలు లంచాల కోసం ఏ స్థాయిలో వేధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

Click on Image to Read:

sachin

hero-shivaji

nagarjuna-Sumalatha-wedding

jc diwakar reddy anantapur collector shashidar

adi-reddy-apparao

chandrababu-naidu

lokesh

dk-aruna

prathipati-pulla-rao

chandrababu-naidu

adinarayana-reddy

gottipati-ravikumar

pattipati-pullarao

kovur-tdp-mla-polam-reddy-s