టీడీపీకి మరో గట్టి షాక్

తెలంగాణలో టీడీపీకి మిగిలిన నూకలను కూడా ఇతర పార్టీలు మింగేస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు మినహా టీడీపీ ఎమ్మెల్యేలందరూ కారెక్కేయగా… ఇప్పుడు సీనియర్ నాయకులు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. దివంగత నేత మాధవరెడ్డి భార్య, మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. ఇప్పటికే జానారెడ్డితో ఆమె చర్చలు జరిపిందని చెబుతున్నారు.

కాంగ్రెస్‌ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆమె పార్టీ మారుతారు. తెలంగాణలో ఇక టీడీపీ బతకడం అసాధ్యమన్న నిర్ధారణకు వచ్చిన ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరిలోనూ కాంగ్రెస్‌కు బలమైన నేత అవసరం ఉండడంతో కాంగ్రెస్‌ నేతలు కూడా ఉమామాధవరెడ్డిని పార్టీలోకి తెచ్చేందుకు చొరవచూపారు. మాధవరెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. ఓ దశలో తెలంగాణ టీడీపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే మావోయిస్టుల మందుపాతరకు ఆయన బలైపోయారు. మాధవరెడ్డిపై జరిగిన దాడిపై అప్పట్లో అనేక అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. మాధవరెడ్డి మరణంతో ఆయన భార్య రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆమె పార్టీ వీడితే టీటీడీపీకి నల్లగొండ జిల్లాలో గట్టి దెబ్బే.

Click on Image to Read:

chandrababu-naidu

lagadapati

tdp mp tota narasimham

kadapa-coporater

ys-jagan

sun-edition-solar-plant

hero-shivaji

sachin

nagarjuna-Sumalatha-wedding

jc diwakar reddy anantapur collector shashidar

adi-reddy-apparao

chandrababu-naidu

lokesh

dk-aruna

prathipati-pulla-rao

chandrababu-naidu

adinarayana-reddy

kovur-tdp-mla-polam-reddy-s