చిరు ఖైదినెంబ‌ర్ 150 పోస్ట‌ర్  అర్ధం ఏమిటో..!

భార‌తీయ సినిమా చ‌రిత్రిలో   షోలేది ఒక ప్ర‌త్యేక‌మైన స్థానం.  క‌మ‌ర్షియ‌ల్ సినిమా  ట్రెండ్ కు  ఒక గైడ్  గా నిలిచింది.  ఆఫ్ కోర్స్  ఆ చిత్రం ఇప్ప‌టికి ఒక క్లాసికే అని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు.  ఆ త‌రువాత   తెలుగులో  ఆ త‌ర‌హా ట్రెండ్ సెట్ట‌ర్ అంటే  చిరంజీవితో ద‌ర్శ‌కుడు కోదండ‌రామిరెడ్డి చేసిన ఖైది చిత్ర‌మ‌నే చెప్పాలి.  మూస సినిమాను బ్రెక్ చేసి..  ఒక కొత్త ర‌క్తం ఎక్కించింది. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్,  కృష్ణ‌, శోభ‌న్ లు పాతుకు పోయి సూప‌ర్ స్టార్స్  గా  వెలిగిన ఇండ‌స్ట్రీలో ఖైదితో చిరంజీవి  స‌రికొత్త  చరిత్ర‌ను రాసుకున్నాడు.  మెగాస్టార్ గా ఎద‌గాడానికి  పునాది వేసుకున్నాడు.

మ‌రి  10 ఏళ్లు  గ్యాప్  తీసుకుని  తాజాగా  వివి వినాయ‌క్ డైరెక్ష‌న్లో  చిరంజీవి సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ లో  ఖైది సెంటిమెంట్ ను ఫాలో అవుతూ.. ఖైది నంబ‌ర్ 150 అని పెట్టారు.  సినిమా మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.   అంతా బాగానే ఉంది.  పోస్ట‌ర్ లో చిరు లుక్ నే అర్ధం కాకుండ చీక‌ట్లో  పెట్టి..  ఆయ‌న బ్యాక్ సైడ్ బాగాని లైట్  లైటింగ్ లో చూపించారు.   పాస్ సోర్ట్ సైజ్ లో   ఆయ‌న  వెన‌క‌కు తిరిగి వున్న  ఇమేజ్ క‌నిపించేలా వ‌దిలారు.   బాస్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్ తో    వ‌దిలారు.   ఈ చిత్రాన్ని  కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ పై రామ్ చర‌ణ్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.  సంక్రాంతి పండ‌గ కు రిలీజ్ అయ్యేలా స‌న్నాహాలు చేస్తున్నట్లు  గ‌తంలో  వార్త‌లు వెలువ‌డ్డాయి.