వైజాగ్ లో సినిమా చూసిన సమంత

ఓ సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే… తను ఎక్కడున్నప్పటికీ అర్జెంట్ గా ఆ సినిమా చూసేయాలనుకుంటుంది సమంత. తాజాగా జ్యో అచ్యుతానంద సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాకు మొదటి రోజే టాక్ అదిరిపోయింది. అన్ని ఏరియాస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కామెడీకి క్లాస్ జనాలంతా తెగ నవ్వుకుంటున్నారు. మాస్ కు కూడా ఇప్పుడిప్పుడే సినిమా ఎక్కుతోంది. ఇప్పుడీ టాక్ సమంత వరకు కూడా వచ్చింది. అందుకే వెంటనే సినిమా చూసేయాలనుకుంది సమంత. స్టార్ హీరోయిన్ చూడాలనుకుంటే అడ్డేం ఉంటుంది. నిర్మాతలే స్వయంగా ఏర్పాట్లు చేశారు. అయితే సమంత హైదరాబాద్ లో లేదు. ఓ ప్రచార కార్యక్రమం కోసం వైజాగ్ వెళ్లింది. అయినప్పటికీ విశాఖలో సమంత కోసం షో ఏర్పాటుచేశారు. అలా జ్యో అచ్యుతానంద సినిమాను ప్రత్యేకంగా చూసిన సమంత… తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. సినిమా చాలా బాగుందని మెచ్చుకుంది. ఈమధ్య కాలంలో ఇంత ఎమోషనల్ డ్రామాను చూడలేదని, ఇలాంటివి మరిన్ని సినిమాలు రావాలని మనసారా కోరుకుంది. హీరోలు, హీరోయిన్ తో పాటు… టోటల్ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పింది సమంత.