”కేసీఆర్ ఏమంటున్నారు?” ఫోన్లలో ఏపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆరా

తెలంగాణ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని మూడు నెలల్లో తేల్చాలంటూ టీ స్పీకర్‌కు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాదు కోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హైరాన పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు పెద్దగా ఆందోళన చెందడం లేదంటున్నారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ పార్లమెంట్‌, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు, పాడేరు ఉప ఎన్నికల్లో ఊహించని భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. ఈ నేపథ్యంలో తమపై అనర్హత వేటు వేసినా ఉప ఎన్నికలకు వెళ్తే గెలుపొందడం ఖాయమన్న నమ్మకాన్ని తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కోర్టు ఒత్తిడితో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి వస్తే అంతకంటే ముందుగానే వారి చేత రాజీనామా చేయించి  ఉప ఎన్నికలకు వెళ్లేందుకు కూడా కేసీఆర్‌ సిద్ధంగానే ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో ఉన్న తమ పాతపరిచయస్తులకు ఫోన్‌ చేసి కేసీఆర్‌ ఆలోచన ఏంటన్నది ఆరా తీస్తున్నారు.

ఒకవేళ కేసీఆర్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే తమపై ఏపీలో ఒత్తిడి మరింత పెరుగుతుందన్నది ఏపీ ఫిరాయింపుదారుల ఆందోళన. దమ్ముంటే తెలంగాణ తరహాలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎన్నికలకు రావాలని ప్రతిపక్షం తీవ్రస్థాయిలో దాడి చేసే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు పరిపాలన తీరును బట్టి ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లడం అంటే రాజకీయ జీవితాలను తారుమారు చేసుకోవడం అవుతుందన్న ఆందోళన ఏపీ ఫిరాయింపు దారుల్లో వ్యక్తమవుతోంది. రాయలసీమకు చెందిన ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే ఒక టీఆర్‌ఎస్‌ నేతకు ఫోన్ చేసి ఈ అంశం మీదే ఆరా తీశారట. టీఆర్‌ఎస్‌ నేత మాత్రం తాము దేనికైనా సిద్ధంగానే ఉన్నాయని, కేసీఆర్‌ కూడా ఉప ఎన్నికలు వచ్చినా ఇబ్బంది లేదన్న ధోరణితోనే ఉన్నారని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, చివర్లో రెండు ఓదార్పు మాటలు కూడా చెప్పారట సదరు టీఆర్‌ఎస్ నేత. అయినా ఎంగిలికూడుకు ఎగబడడం ఎందుకు… ఆకలి తీరాక ఆయాసపడడం ఎందుకు?.

Click on Image to Read:

chandrababu-naidu-schizophrenia-disease

mla-alla-ramakrishna-reddy

chandrababu-phd