శ్రీనగర్‌లో రక్తం ఏరులై పారుతుంది… జాగ్రత్త

పాకిస్తాన్‌ సమాచారశాఖ మంత్రి ఫర్వేజ్‌ రషీద్ మరోసారి నోరుపారేసుకున్నారు. శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా ఆ తర్వాత రక్తం ఏరులై పారుతుందని భారత్‌కు హెచ్చరించారు. శ్రీనగర్‌లో అశాంతి కొనసాగినంత కాలం ఢిల్లీలో శాంతి ఉండబోదని వ్యాఖ్యానించారు. ఉరి ఘటన నేపథ్యంలో పాక్‌ను ఏకాకిని చేస్తామన్న మోదీ ప్రకటన పైనా రషీద్‌ తీవ్రంగా స్పందించారు. కాశ్మీర్‌వాసులను హింసిస్తున్న భారతే ఒంటరి అవుతుందన్నారు. శ్రీనగర్‌లో ఏరులై పారే రక్తానికి భారతదేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీ-పెక్)ను చూసి ప్రపంచం మొత్తం హర్షిస్తుంటే భారత్ దానిని వ్యతిరేకిస్తూ ఏకాకిగా మిగిలిందన్నారు.