మజ్నుకు ఊహించని దెబ్బ

సరైన టైం చూసి మజ్నును విడుదల చేశారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ విడుదలై 3 వారాలు అయిపోయింది. దాని హవా ప్రస్తుతం తగ్గింది. మరోవైపు హిట్ టాక్ తెచ్చుకున్న జ్యో అచ్యుతానంద సినిమా కూడా డీసెంట్ టాక్ తో నడుస్తోంది. సో… ఇంకో సినిమాకు స్పేస్ ఉండనే ఉంది. ఆ ఖాళీని మజ్ను పర్ ఫెక్ట్ గా భర్తీచేశాడు. బాక్సాఫీస్ లో వరుసగా నాలుగో హిట్ అందుకునే దిశగా దూసుకుపోతున్నాడు. అయితే అంతా బాగానే ఉందనుకున్న టైమ్ లో మజ్నుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నైజాం వసూళ్లలో కీలకంగా ఉన్న హైదరాబాద్ లో మజ్ను సినిమాకు వర్షాలు పెద్ద ఇబ్బందిగా మారాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మజ్ను కలెక్షన్లపై కచ్చితంగా ప్రభావం చూపించడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఓపెనింగ్ కారణంగా శుక్రవారం రోజున మజ్నుకు జనాలు పోటెత్తినప్పటికీ… శని, ఆదివారాల్లో వర్షాల కారణంగా… ప్రేక్షకులు ఇళ్లు విడిచి బయటకు రావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ అడ్డంకిని అధిగమించి మజ్ను వసూళ్లు రాబడితే మాత్రం కచ్చితంగా హిట్ అవుతుంది. లేదంటే వసూళ్లలో ఓ యావరేజ్ సినిమాగా నిలిచిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ ఏరియాస్ లో మజ్ను పాజిటివ్ టాక్ తో నడుస్తోంది.