మహా అయితే బట్టలు ఊడదీయించి …

ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమనేత ముద్రగడ మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు స్పూర్తి వల్లే కాపు ఉద్యమం పుట్టిందని చెప్పారు. కాపు ఉద్యమం పుట్టడానికి మూలకారకుడు చంద్రబాబేనన్నారు. బామ్మర్ది బాలకృష్ణ కోసం వైఎస్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ”మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయి. మహా అయితే ఆఖరికి పోలీసుల చేత నా బట్టలు ఊడదీయించి బూటు కాళ్లతో తన్నిస్తారు అంతే కదా. నన్ను ఏమైనా చేసుకోండి… కానీ మా జాతికిచ్చిన హామీని అమలు చేయాల్సిందే” అని ముద్రగడ అన్నారు. తనది దొంగ దీక్ష అంటున్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దీక్షలు ఏమిటో చెప్పాలన్నారు. దమ్ముంటే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఆమరణ దీక్షకు దిగాలని ముద్రగడ సవాల్ చేశారు. చంద్రబాబుతో పాటు తానూ దీక్షలో కూర్చుకునేందుకు సిద్ధమన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు.

Click on Image to Read:

chandrababu-naidu-schizophrenia-disease

mla-alla-ramakrishna-reddy

chandrababu-phd