లాస్యతో వివాహం పై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ , టీవీ యాంకర్ లాస్య సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని వెబ్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని… ఇంట్లో పెద్దోళ్లు ఒప్పుకోకపోవడంతో…. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని గుప్పుమన్నాయి. దీంతో టోటల్ టాలీవుడ్ అంతా షాక్ అయింది. తెలిసినవాళ్లంతా రాజ్ తరుణ్ కు ఫోన్ చేసి మరీ విషయం ఆరా తీయడం మొదలుపెట్టారు. వరుస ఫోన్ కాల్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిన రాజ్ తరుణ్… తన ఫేస్ బుక్ పేజీ సాక్షిగా దీనిపై వివరణ ఇచ్చాడు. తన పేజీలో ఈ పుకారుపై సుదీర్ఘంగా రాసుకొచ్చాడు. ముందుగా సభకు నమస్కారం అంటూ స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్… అసలు లాస్యకు తనకు పరిచయమే లేదని ప్రకటించాడు. కేవలం కుమారి 21-ఎఫ్ ఆడియో ఫంక్షన్ లో మాత్రమే లాస్యను కలిశామని, తర్వాత తనకు లాస్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశాడు. అంతేకాదు.. మరో 3ఏళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా తనకులేదంటున్నాడు. ఈ సందర్భంగా… లాస్యతో దిగిన కొన్ని ఫొటోల్ని కూడా రాజ్ తరుణ్ షేర్ చేయడం విశేషం. తనకు తెలియకుండానే… లాస్యతో తన పెళ్లి చేసిన మీడియాకు రాజ్ తరుణ్ కామెడీగా కృతజ్ఞతలు కూడా చెప్పాడు.

Also Read

పవన్ మరదలు ఎవరో తెలిసిపోయింది…పవన్ మరదలు ఎవరో తెలిసిపోయింది…  

 

 

మజ్నుకు ఊహించని దెబ్బ

 

 

మజ్నుకు ఊహించని దెబ్బ