వ్యక్తిగత అలవాట్లను పోల్చిన జగన్.. బాబుకు వైఎస్‌ చేసిన సాయం….

జగన్‌ సభలకు పిల్లలను పంపితే చెడిపోతారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రవాసాంధ్రుల కార్యక్రమంలో జగన్‌ స్పందించారు. పిల్లలను చెడగొట్టే అలవాటు చంద్రబాబుకే ఉందన్నారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ పిల్లలను కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. తాను గర్వంగా చెప్పగలుగుతున్నానని తనకు ఒక్క చెడు అలవాటు కూడా లేదన్నారు. తాగుడు అలవాటో మరో అలవాటో తనకు లేదన్నారు. పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని తాను అన్నారు. రాముడు మంచి బాలుడు అన్నట్టుగానే తాను బతుకుతున్నానని చెప్పారు. చంద్రబాబుకు ఏఏ అలవాట్లుఉన్నాయో మాత్రం తనకు తెలియదన్నారు. చివరకు సొంత కొడుకును కూడా చెడగొడుతున్న వ్యక్తి చంద్రబాబు అని జగన్ విమర్శించారు. ఏ కొడుకైనా తండ్రినే రోల్‌ మోడల్‌గా తీసుకుంటారని ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న అబద్దాలు, మోసాలు, వెన్నుపోట్లు చూసి ఆయన కుమారుడు కూడా చెడిపోతున్నారన్నారు. అధికారం కోసం ఏమీ చేసినా తప్పు కాదన్నది కుమారుడికి నేర్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ధైర్యముంటే 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. చంద్రబాబు చేతిలో అధికారం, డబ్బు, పోలీసులు అన్ని వ్యవస్థలు ఉన్నాయని… అయినా సరే ఎన్నికలకు తాము సిద్ధమని జగన్ సవాల్ చేశారు. చంద్రబాబు అంగీకరించిన అంగీకరించకపోయినా చంద్రబాబు కాంగ్రెస్‌లో మంత్రి కావడానికి కారణం వైఎస్సేనన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తామనడం మూర్ఖత్వమన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ క్యారెక్టర్‌ను అమ్ముకునే వ్యక్తిని తాను కాదన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా క్యారెక్టర్‌ను మాత్రం వదులుకోనన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తే ఉండదన్నారు. మరో రెండున్నరేళ్లు కూడా హోదా కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు.

Click on Image to Read:

ys-jagan-pawan

ys-jagan-special-status