బొత్సపై మాత్రమే బాబుకు దయ కలిగిందా?

చంద్రబాబు అనుకుని ఉంటే ఈ పాటికి బొత్స సత్యనారాయణ జైల్లో ఉండేవారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. చంద్రబాబు ధర్మరాజులాంటి వాడు కాబట్టే లిక్కర్‌ సిండికేట్‌, ఇసుక మాఫియా, వోక్స్‌వ్యాగన్‌ కేసుల్లో బొత్సను వదిలిపెట్టారని చెప్పారు. కక్షసాధింపు ఎందుకన్న ఉద్దేశంతోనే చంద్రబాబు అలా చేశారని చెప్పారు. అలాంటి చంద్రబాబును పట్టుకుని బొత్స సత్యనారాయణ విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 2000 సంవత్సరంలో కొడుక్కు కాలేజీలో సీటు తెచ్చుకునేందుకు కూడా కేవీపీ దగ్గర డబ్బులు ఉండేవి కాదన్నారు ముద్దు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

అయితే కక్షసాధింపు ఎందుకులే అన్న ఉద్దేశంతోనే బొత్స సత్యనారాయణను జైలుకు పంపకుండా చంద్రబాబు వదిలేశారని ముద్దు చెప్పడం ఆసక్తిగా ఉంది. ముద్దు చెప్పినట్టు చంద్రబాబు ధర్మరాజు, కక్ష సాధింపు వద్దు అనుకునే వ్యక్తే అయితే వైసీపీ నేతలను వెంటపడి కేసులు పెట్టి జైలుకెందుకు పంపుతున్నారో!. పార్టీ సీనియర్ నేతలతో కేసులు వేయించి జగన్ ను జైల్లో ఎందుకు పెట్టించినట్టో!. బాబు సీఎం అయిన తర్వాత చెవిరెడ్డి ఇప్పటికే మూడునాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చారు. రోజాపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వెంబడించారు. డీఎస్పీని డోన్ట్ టచ్‌ మీ అన్నందుకే పార్టీ ఫిరాయించక ముందు భూమానాగిరెడ్డిని జైలుకు పంపారు. లేటెస్ట్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని పదేపదే సీఐడీ విచారణకు పిలిపించి ఆట అడుకుంటున్నారు. ముద్దు చెబుతున్నట్టు చంద్రబాబు సాధుజీవి అయి ఉంటే ఇవి కూడా చేయకుండా ఉండేవారు కదా!.

Click on Image to Read:

ys-jagan-chandrababu-naidu-political-career

ys-jagan-pawan

ys-jagan-special-status