వాటికి హ‌ద్దు లేదంటున్న కాజ‌ల్…

కోరిక‌లు లేకపోతే  జీవితం లేదు. అలా అని అవి ఎక్కువైతే దుఃఖ‌మే త‌ప్ప  సంతోషం ఉండ‌దు.  సాధార‌ణంగా  సైకిల్ తొక్కుకుంటూ కారు గురించి  ఆలోచిస్తాం.  కారులో తిరిగే అవ‌కాశం  వ‌స్తే విమానాల వంక చూస్తాం. కోరిక‌ల‌కు హ‌ద్దు ఏముంది అంటోంది కాజ‌ల్.  జీవితాంతం ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర  ప‌రుగు ఆప‌కపోతే  ఆశాంతి త‌ప్ప‌..శాంతి ఉండ‌ద‌ని చెబుతోంది. ప్ర‌స్తుతం  చిరంజీవి న‌టించిన ఖైది నంబ‌ర్ 150 లో న‌టిస్తోంది. మ‌రో సినిమా కోసం రానాతో   జోడి కడుతుంది. జీవాతో క‌లిసి  న‌టించిన “ఎంత వ‌ర‌కు ఈ ప్రేమ”  త్వ‌ర‌లో   విడుద‌ల కాబోతోంది. కాజ‌ల్ మాట్లాడుతు కోరిక‌ల‌కు మ‌న‌మే క‌ళ్లెం వేయాల‌ని సెల‌విచ్చింది.  త‌న వ‌ర‌కు   కొరిక‌ల చిట్ట చాలా చిన్న‌దిగా ఉంటుంద‌ని .. చిన్న చిన్న ల‌క్ష్యాలు  సెట్ చేసుకుని  వాటిని  సాధించుకొంటూ ఆనందిస్తుంటా పోవడంవల్లే త‌న‌కు నిరుత్సాహాం ద‌రి చేర‌దు అని చెప్పుకొచ్చింది.