చిన్న సినిమాకు మహేష్ బాబు ప్రచారం

నందిని నర్సింగ్ హాస్టల్… ఈ సినిమా గురించి చాలామందికి తెలియదు. అసలు ఇదొక సినిమా ఉందని, త్వరలోనే విడుదల కాబోతుందనే విషయం కూడా చాలామందికి తెలీదు. ఇలాంటి సినిమాని తన భుజాన వేసుకున్నాడు మహేష్ బాబు. సినిమాకు ఫుల్లుగా ప్రచారం కల్పించాలని డిసైడ్ అయ్యాడు. దీనికి కారణం ఇది తన కుటుంబచిత్రం కావడమే. అవును… నందిని నర్సింగ్ హోంలో ఒకనాటి కామెడీ స్టార్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా నటించాడు. నరేష్ అంటే స్వయంగా మహేష్ బాబుకు అన్న. విజయ నిర్మల కొడుకు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే నవీన్ విజయకృష్ణ కోసం మహేష్ బాబు కొన్ని రోజులు తన సినిమా షూటింగ్ లు వాయిదా వేసుకున్నాడు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు. సినిమా ప్రమోషన్ ను కూడా దగ్గరుండి చూసుకోబోతున్నాడు. గతంలో సుధీర్ బాబు విషయంలో కూడా మహేష్ ఇలానే చేశాడు. ప్రస్తుతం సుధీర్ బాబు ఇండస్ట్రీలో కుదురుకున్నాడు. ఇప్పుడు నవీన్ విజయ్ కృష్ణ కూడా మహేష్ అండతో పాతుకుపోవాలని చూస్తున్నాడు.

Also Read

మజ్నుకు ఊహించని దెబ్బమజ్నుకు ఊహించని దెబ్బ

 

 

            లాస్యతో వివాహం పై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్లాస్యతో వివాహం పై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్