2 స్టేట్స్ రీమేక్ లో స్టార్ జోడీ

సమంత-నాగచైతన్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వచ్చే ఏడాది వాళ్ల వివాహం ఉంటుందనే టాక్ నడుస్తోంది. పెళ్లి కోసమే సమంత సినిమాలు మానేసిందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ స్టార్ జోడీపై అంచనాలు మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికే 3 సినిమాల్లో కలిసి నటించిన నాగచైతన్య-సమంత జోడీనీ… కుదిరితే మరోసారి రిపీట్ చేసేందుకు చాలామంది మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇందులో అభిషేక్ పిక్చర్స్ సంస్థ కూడా ఉంది. హిందీలో హిట్టయిన 2-స్టేట్స్ సినిమా తెలుగు రైట్స్ ను ఈ సంస్థ దక్కించుకుంది. ఆ మూవీలో అర్జున్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక తెలుగు వెర్షన్ లో చైతూ-శామ్ అయితే కరెక్ట్ గా సరిపోతారని  అభిషేక్ పిక్చర్స్ సంస్థ అభిప్రాయపడుతోంది. అయితే ఇదంతా కేవలం వాళ్ల ఊహ మాత్రమే. సమంత మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సినిమాలు చేయదు. సో… 2-స్టేట్స్ సినిమాను మరో కపుల్ తో నిర్మించేందుకు సదరు సంస్థ సిద్ధపడుతోంది. తాజాగా సమాచారం ప్రకారం… 2-స్టేట్స్ రీమేక్ కోసం నానిని సంప్రదించినట్టు తెలుస్తోంది. వినాయక్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వెంకట్.. ఈ రీమేక్ తో దర్శకుడిగా మారుతున్నాడు.

Also Read