కాటమరాయుడు లో అన్నయ్యగా పవన్ కళ్యాణ్ 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నయ్య అంటే మెగాస్టారే. ఆయన అభిమానులందరూ ఆయనకు తమ్ముళ్లే. మెగాస్టార్ తరవాత ఆయన తరహాలోనే కాటమరాయుడు సినిమాలో అన్నయ్య క్యారెక్టర్ లో నటించనున్నాడు పవన్ కళ్యాణ్. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వీరమ్’ చిత్రానికి ఇది రీమేక్ అని సమాచారం. ఈ సినిమాలో అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు తమ్ముళ్లు, వారికి అన్నయ్యగా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ నలుగురు తమ్ముళ్లలో కమల్ కామరాజు  ఒక తమ్ముడిగా నటిస్తున్నాడు. 
తమ్ముళ్లే సర్వస్వం అనుకుంటూ బ్రతికే తమ అన్నయ్య ఎప్పుడో చిన్నప్పుడే ఆగిపోయిన లవ్ స్టోరీనే  తలుచుకుంటూ ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడకపోయేసరికి, అన్నయ్య పెళ్ళైతే కానీ తమ లైన్ క్లియర్ కాదు అని భయపడ్డ తమ్ముళ్లు, ఎలాగైనా అన్నయ్య పెళ్లి చేయాలని డిసైడ్ అయి ఎవరో అమ్మాయిని  తీసుకువఛ్చి ఆ అమ్మాయే ఆయన చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తారు. దాంతో కథలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా కథని బాగా రక్తి కట్టించే అంశాలు ఫ్యాక్షనిజం, పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టు నిస్వార్థంగా ఊరి ప్రజల కోసం పాకులాడటం లాంటివి చాలానే ఉంటాయనుకోండి. కాకపోతే ఇప్పటి వరకు తమ్ముడిలా కనిపించిన పవర్ స్టార్ అన్నయ్యలా కొత్తగా కనిపించనున్నాడు . అదన్న మాట ఎక్జయిట్మెంట్.