పవన్‌ కళ్యాణ్‌ను ఈసారి ఇలా వాడుకుంటారా?

గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ సహకారం వల్ల అత్తెసురు మెజారిటీతో చంద్రబాబు అధికారాన్ని అందుకోగలిగాడు. సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా పవన్‌ కళ్యాణ్‌ రంగంమీద కనిపిస్తున్నాడు. ఆయనే సొంతంగా వస్తున్నాడో, చంద్రబాబు డైరెక్షన్‌ ప్రకారం వస్తున్నాడో తెలుగు ప్రజలు ఎవ్వరికీ అర్ధంకాని పరిస్థితి.

ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ను ఎలా వాడుకోబోతున్నాడు అనేది బిలియన్‌ డాలర్ల ప్రశ్న. సమాధానం కొంచెం లీక్‌ అయినట్లుగా అనిపిస్తోంది దళిత నాయకుడు ప్రొఫెసర్‌ గాలి వినోద్‌ కుమార్‌ మాటలను వింటుంటే.

చిత్తూరు జిల్లాలో ఒక సమావేశంలో మాట్లాడుతూ గాలి వినోద్‌ కుమార్‌ వచ్చే ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ జనసేన బహుజనులతో కలిసి పోటీచేస్తే ఫలితాలు బాగుంటాయని వినోద్‌ కుమార్‌ చెప్పారు. అది ఆయన సొంత ఆలోచనా? లేక ఎవరినుంచి అయినా అలాంటి ప్రతిపాదన వచ్చిందా? తెలియాల్సి ఉంది.

ప్రజలకు మేలుచేసి, ప్రజాభిమానం చూరగొని పాలన సాగించిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఆయన రాజకీయ జీవితమంతా ఎత్తులు, జిత్తులతోనే నడిచింది. గతంలో కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారులుగా ఉన్న దళితులను రిజర్వేషన్ల పేరుతో రెండుగా చీల్చాడు. కొంతవరకు లాభ పడ్డాడు.

కానీ దళితులు ఎక్కువ శాతం మంది వైసీపీకి అభిమానులుగా ఉన్నారు. దళితులు, మైనార్టీలు ఈసారి ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే దళితులను వైసీపీ నుంచి దూరం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలప్పుడు కూడా బిఎస్‌పిని రంగంలోకి దించాలని చూశాడు. సాధ్యం కాలేదు. ఈసారి తన జేబులో బొమ్మలాంటి పవన్‌ కళ్యాణ్‌ను అడ్డంపెట్టి దళితులను వైసీపీకి దూరం చేసే ఆలోచనలో ఉన్నాడా? ఆ పెద్ద పథకంలో భాగమే ఈ చిన్ని ఆలోచనా?

Click on Image to Read:

kurugondla-ramakrishna

chandrababu-naidu-ramakrishna

konatala-ramakrishna