అస‌లు స‌మంతకు ఏమైంది..?

టాప్ హీరోయిన్  లీగ్ లో  ఎంట్రీ కావాలంటే..    సింపుల్ కాదు.  స్టార్ హీరో ల‌తో  మంచి హిట్స్ కొట్టాలి.  స్టార్ హీరోల‌తో  అవ‌కాశాలు అంత తేలిక కాదు.   అయితే  స‌మంత విష‌యంలో  కొంత ల‌క్ అనే చెప్పాలి.   త‌మిళ్ లో  ఏవో ఒక‌టి రెండు చిత్రాలు  చేసి పెద్ద‌గా గుర్తింపు లేని స‌మంత‌… ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్  తెలుగులో   నాగ‌చైత‌న్య తో చేసిన  ఏ మాయ చేశావే చిత్రం ఆమే జీవితాన్నిమార్చి వేసింది.  క్యూట్ అండ్ హాట్ బ్యూటీ తో  స‌మంత  తెలుగు యంగ్ ఆడియ‌న్స్ డ్రీమ్ గాళ్ అయ్యింది. అంతగా మాయ చేసేసింది.  ఆ త‌రువాత వ‌ర‌స‌గా ఎన్టీఆర్, మ‌హేష్ బాబు చిత్రాల్లో  ఆఫ‌ర్స్ రావ‌డం..ఆ సినిమాలు బిగ్ హిట్స్ కావ‌డంతో  స‌మంత  ఊహించేలోపే  స్టార్ హీరోయిన్ అయ్యింది. అదే జోరులో త‌మిళ్  స్టార్  హీరోలు విజ‌య్,   సూర్య ల చిత్రాల్లో న‌టించి  మెప్పించింది.  ఓవ‌రాల్ గా స‌మంత  స్టార్  అయ్యింది.
సినిమా  కెరీర్ ఒకెత్తు అయితే.. ప్ర‌స్తుతం  నాగ చైతన్య తో ల‌వ్ మ్యాట‌ర్ ఒకెత్తు.   అయితే  పెళ్లి త‌రువాత  సినిమాల‌కు  గుడ్ బాయ్ చెప్పాల‌నే ఆలోచ‌న ఉందంటూ రూమ‌ర్స్ వ‌స్తున్నాయి.  ఈ నిర్ణ‌యం  తీసుకోవ‌డానికి స‌మంత పెళ్లికి  కొంత సంబంధం ఉండోచ్చు అనేది  ప‌రిశీల‌కుల మాట‌. ఎందుకంటే   మ్యారేజ్ త‌రువాత   సినిమాలు ఆపేయ‌క పోతే  బావుండ‌ద‌నేది  అక్కినేని  నాగార్జున  అభిప్రాయంగా తెలుస్తుంది. మ‌రి మామ‌గారి  అభిప్రాయాన్ని గౌర‌వించ‌క త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి  స‌మంత‌కు  వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. అందుకే  ప్ర‌స్తుతం వ‌స్తున్న ఆఫ‌ర్స్ ను   స‌మంత  అంగీకరించ‌డం లేదనే ఒక వార్త వినిపిస్తుంది. అయితే స‌మంత మాత్రం  మంచి రోల్స్ రావ‌డం లేదు అందుకే చేయ‌డం లేద‌ని  చెప్పుకొస్తుంది.  మ‌రి మంచి రోల్స్ అంటే త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన రోల్స్ ఏమిటి అనేది  క్రిటిక్స్  ప్ర‌శ్న‌.  మ‌రి ఇదంతా  చూస్తుంటే  స‌మంత సినిమాల విష‌యంలో  కొంత గంద‌ర గోళంలో ఉంద‌నేది స్ప‌ష్టం గా తెలుస్తుంది  అంటున్నారు  ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు.