రాహుల్‌పై చెప్పు విసిరిన వ్యక్తి

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ఒక ఆగంతకుడు చెప్పు విసిరాడు. అది రాహుల్ తలకు తాకింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో సీతాపూర్‌లో రాహుల్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎస్‌పీజీ భద్రతలో ఉండే రాహుల్‌పైకి అతి సమీపం నుంచి ఆగంతకుడు చెప్పు విసిరిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాహుల్‌పైకి చెప్పు విసిరిన ఆగంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.