సుమంత్ కోసం మహేష్ చొరవ…

‘ఏమో గుర్రం ఎగరవచ్చు’ తరవాత సుమంత్ చాలా గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రం నరుడా డోనరుడా. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన విక్కీ డానర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజయింది.మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 
మరీ రొటీన్ కాన్సెప్ట్స్ కాకుండా వెరైటీ గా ఉండే కథలను ఎంచుకునే సుమంత్ ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ‘నరుడా డోనరుడా’ సినిమా ఫస్ట్ లుక్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి ఈ సినిమా పట్ల మహేష్ బాబు ఫ్యాన్స్  లో కూడా ఓ రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. నరుడా డోనరుడా విషయంలోనే కాదు  సుమంత్ గత సినిమాలను కూడా మహేష్ బాబు ఇలాగే ప్రమోట్ చేశాడు.
ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా వెంటనే ఆ పర్టికులర్ స్టార్ కి కాల్ చేసి మరీ అభినందించే అలవాటు ఉన్న మహేష్ బాబు సినిమా రిలీజ్ కి ముందే ఇలా ఏ హీరో సినిమాని సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ ప్రమోట్ చేయలేదు. ప్రమోషన్ ఒక్కటే కాదు, నరుడా డోనరుడా సినిమా ఆడియో ఫంక్షన్ కి కూడా మహేష్ బాబు అటెండ్ అవుతున్నాడని సమాచారం. అదే మరీ  ఫార్మాలిటీ కి ఫ్రెండ్ షిప్ కి ఉన్న డిఫరెన్స్!!