బాబు ఎత్తులపై నిపుణుల బృందం విస్మయం… త్వరలో అన్నా హజారే రాక

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో నిపుణుల బృందం పర్యటించింది. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పోరాటం చేస్తున్న బొల్లిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది సంజయ్‌ పారిక్‌, ప్రొఫెసర్ విక్రం సోనిలతో కూడిన నిపుణుల బృందం రెండు రోజులపాటు 29 గ్రామాల్లో విస్రృతంగా పర్యటించింది. రాజధాని ప్రాంతంలో తీరుతెన్నులను చూసి సుప్రీం కోర్టు న్యాయవాది సంజయ్ పారిక్‌ విస్మయం వ్యక్తం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఇప్పటి వరకు ప్రభుత్వం వినిపించిన వాదనలన్నీ అబద్దమని తమ పర్యటనలో తేటతెల్లమైందని చెప్పారు.

ప్రభుత్వ న్యాయవాది తన వాదనల్లో లంక గ్రామాల్లో ప్రజలు నివసించడం లేదంటూ చెప్పారని కానీ ఇక్కడ లంక గ్రామాల్లో గిరిజనులు, దళితులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నట్టు తమ పర్యటన ద్వారా తెలుసుకున్నామన్నారు. ఏటా మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం స్వాధీనం చేసుకోవడంతో దళితులు, గిరిజనులు ఉపాధి కోల్పోయారని ఆవేదన చెందారు. కృష్ణాపరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల తీరు తమకు ఆశ్చర్యం కలిగించిందని బృందం సభ్యులు చెప్పారు. ఇసుక రవాణా కోసం ఇసున తిన్నెలపై ఎతైన మెరకలు వేసి రోడ్లు నిర్మించి ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేయడం తమను విస్మయపరించిందన్నారు. ఇక్కడ ఇసుక మొత్తం మాఫియా చేతుల్లో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇక్కడి ప్రజల ఆవేదన మొత్తం వీడియో రికార్డు చేశామని వాటిని ట్రిబ్యునల్ ముందు ఉంచుతాయని సుప్రీం కోర్టు న్యాయవాది సంజయ్ చెప్పారు. త్వరలోనే రాజధాని ప్రాంతానికి అన్నా హజారేను కూడా తీసుకొస్తామని బొల్లిశెట్టి సత్యనారాయణ చెప్పారు. ఇక్కడ జరుగుతున్న దారుణాలను ఆయనకు వివరిస్తామన్నారు.

Click on Image to Read: 
pawan-kalyan-janasena

ys-jagan-chandrababu-naidu-political-career

ys-jagan-pawan