కొణతాల రామకృష్ణకు విజయమ్మ ఫోన్

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సతీమణి పద్మావతి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆమె చనిపోయారు. ఆదివారం సాయంత్రం పద్మావతికి గుండెపోటు రావడంతో విశాఖలోని ఒక ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. రాజకీయనాయులు, అభిమానులు కొణతాల సతీమణికి నివాళులర్పించారు. వైఎస్‌ విజయమ్మ ఫోన్‌లో కొణతాలను పరామర్శించారు. ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు,  ఎమ్మెల్యేలు పీజీవీఆర్‌ నాయుడు , పంచకర్ల రమేష్‌బాబు, కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్‌, గొల్ల బాబురావు తదితరులు కొణతాలను పరామర్శించారు.

Click on Image to Read:

tv-9