గాలి జనార్దన్‌ రెడ్డి కూతురి పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు

కర్నాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్‌ రెడ్డి తన కూతురు వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే బెంగళూరులో  కూతురి నిశ్చితార్ధం జరిపించిన జనార్దన్ రెడ్డి … వివాహ వేడుకను  గ్రాండ్‌గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివాహానికి రాజకీయ, పారిశ్రామిక, సినీ ఇండస్ట్రీ నుంచి అనేక మంది హాజరుకానున్నారని ఒక ఆంగ్ల మీడియా కథనం. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే జనార్దన్ రెడ్డి కూతురి వివాహంలో సినీ తారలతో భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొగ్రాం నిర్వహించనున్నారని కథనం. వివాహ వేడుకలో డ్యాన్స్‌ ప్రొగ్రాం చేసేందుకు షారుక్‌ఖాన్, కత్రీనా కైఫ్ ఓకే చేసినట్టు చెబుతున్నారు. వీరితో పాటు ప్రభుదేవా, తమన్నాలతోనూ నృత్యప్రదర్శన ఇప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త కుమారుడితో జనార్దన్‌ రెడ్డి కుమార్తె బ్రహ్మణికి మూడు వారాల క్రితమే బెంగళూరులో ఎంగేజ్‌మెంట్ జరిగింది. బ్రహ్మణి బీబీఎం పూర్తి చేశారు.  వీరి వివాహం నవంబర్‌లో జరగనుందని తెలుస్తోంది.

Click on Image to Read:

kurugondla-ramakrishna

chandrababu-naidu-ramakrishna

konatala-ramakrishna