నిర్మాతగా మారిన రాజమౌళి కొడుకు

ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా ఎంతో మందికి తెలుసు. తన తండ్రి ని చూసి ఎల్లప్పుడూ గర్వపడుతూనే ఉంటాను అని రాజమౌళి కొడుకు కార్తికేయ ఎప్పుడు తన తండ్రి గురించి చెప్తూనే ఉంటాడు. అయితే అలాంటి కార్తికేయ తన తండ్రి నడిచిన దారిలో వెళ్ళట్లేదు. అవును కార్తికేయకి దర్శకత్వం చెయ్యడం ఇంట్రెస్ట్ లేదట. దర్శకుడిగా కంటే కూడా నిర్మాతగా ఉండటం కార్తికేయ కి ఇష్టమట. అందుకే సొంత ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసిన సినిమాలు నిర్మిద్దాం అని డిసైడ్ అయ్యాడు అంట కార్తికేయ.

రాజమౌళి కూడా ఇందుకు ఓకే చెప్పాడు అని తెలుస్తుంది. ఇప్పటికే కార్తికేయ తన ప్రొడక్షన్ హౌస్ లో వచ్చే ఫస్ట్ సినిమా తాలూకు కథని కూడా ఓకే చేసాడు, “బాహుబలి” సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. కార్తికేయ కి కథ, కథనాల్లో మంచి పట్టు ఉంది. అందుకే ఈ సినిమాని కథని దగ్గరుండి మరి రాయించాడట. ఈ ఏడాది చివర్లో గాని వచ్చే ఏడాది లో గాని ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి నిర్మాతగా ఈ దర్శక దిగ్గజం కొడుకు సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.