కాస్టింగ్ కౌచ్ పై ఇలియానా స్పందన

ప్రస్తుతం దేశం మొత్తం ‘మీ-టూ’తో అట్టుడుకిపోతోంది. హీరోయిన్లంతా తమకు ఎదురైన చేదు అనుభవాల్ని మీడియా ముందు పెడుతున్నారు. మరికొందరు దీనిపై స్పందిస్తున్నారు. ఇప్పుడు ఇలియానా వంతు వచ్చింది. కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే బాలీవుడ్ మీడియా ముందు స్పందించిన ఈ గోవాబ్యూటీ, ఇప్పుడు మరోసారి ఈ అంశంపై స్పందించింది.
“కాస్టింగ్ కౌచ్ వివాదం అనేది చాలా సెన్సిటివ్ గా ఉంది. దీనిపై నేను పెద్దగా స్పందించలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మీ-టు ఉద్యమానికి మాత్రం నా మద్దతు ఉంటుంది. మరింతమంది మహిళలు ముందుకు రావాలి. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలి. మీటూ ఉద్యమం అనేది కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే చెందినది కాదనే విషయాన్ని అర్థంచేసుకోవాలి.”
ఇలా మీ-టూ ఉద్యమంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది ఇలియానా. అయితే ఇన్ని విషయాలు చెప్పిన ఈ హీరోయిన్, తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని మాత్రం బయటపెట్టనంటోంది. మీకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పండంటూ మీడియా ప్రశ్నిస్తే, తనకు కూడా అలాంటి చేదు అనుభవాలు ఉన్నాయని పరోక్షంగా అంగీకరిస్తూనే,  వాటిని బయటపెట్టడానికి ఇది సరైన సమయం కాదని ప్రకటించింది ఇలియానా