మహర్షి సెట్స్ లో శింబు

మహేష్ బాబు హీరోగా మహర్షి సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఓ కీలక పాత్రలో అల్లరినరేష్ కూడా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలోకి తమిళ హీరో శింబు ఎలా వచ్చి చేరాడు. అవును.. మహర్షి సెట్స్ లో శింబు సందడి చేశాడు. మహేష్, శింబు కలిసున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

అయితే మహర్షి సినిమాకు శింబుకు సంబంధం లేదు. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్ లో మహర్షి సినిమా షూటింగ్ నడుస్తోంది. అదే ఫిలింసిటీలో శింబు హీరోగా ఓ తమిళ సినిమా షూటింగ్ కూడా నడుస్తోంది. మహేష్ బాబు సెట్స్ లో ఉన్నాడని తెలుసుకొని, తన షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి మరీ మహర్షి సెట్స్ పైకి వచ్చాడు శింబు.

అలా మహేష్-శింబు కలిశారు. చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు తీసిన ఫొటోలే ఇవి. మహేష్ అంటే తనకు ఎంతో ఇష్టమని, మహేష్ నటించిన ప్రతి సినిమా చూశానంటున్నాడు శింబు.