వినయ విధేయ రామ పాట వచ్చేసింది

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న వినయ విధేయ రామ సినిమాకు సంబంధించి పాటల సందడి మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. తన సినిమా ప్రచారాన్ని క్లాస్ గా ప్రారంభించే బోయపాటి, వినయ విధేయకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. తందానే తందానే అనే బ్యూటిఫుల్ ఫ్యామిలీ సాంగ్ ను విడుదల చేశాడు.

రామ్ చరణ్ కుటుంబ సభ్యుల మధ్య మాంటేజ్ సాంగ్ ఇది. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేయడంతో పాటు మధ్యమధ్యలో సినిమాకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్, వీడియోస్ పొందుపర్చడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. మూవీకి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.