ప్రియాంకకు ప్రధాని ఇన్ స్టాగ్రాం పోస్ట్ !

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి రిసెప్షన్ మంగళవారం రాత్రి ఢిల్లీలో గ్రాండ్ గా జరిగింది. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరై…ఆశీర్వదించారు. రిసెప్షన్ లో దిగిన ఫొటోను ప్రధాని అధికారిక ఇన్ స్టాగ్రాం అకౌంట్లో షేర్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ మీ వైవాహిక జీవితం సంతోషకరంగా సాగాలని కోరుకుంటున్నాను…. అంటూ అభినందనలు తెలుపుతూ క్యాప్షన్ ఇచ్చారు.

డిసెంబర్ 1, 2 తేదీల్లో జోధ్ పూర్లోని ఉమైద్ భవన్లో ప్రియాంక, నిక్ జొనాస్ వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట…మంగళవారం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ప్రియాంకచోప్రా, మోదీ నిక్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ప్రియాంక, నిక్ పెళ్లి కోసం స్పెషల్ గా కేక్ ను డిజైన్ చేయించారట. అంతేకాదు ఆ కేక్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయట. 18ఫీట్ల పొడవుతో ఉన్న ఈ కేక్ ను నిక్ పర్సనల్ చెఫ్స్ రెడీ చేశారు. నిక్ కోసం దుబాయ్, కువైట్ నుంచి ఇండియా వచ్చారట.

18 ఫీట్ల పొడవే కాదు…మొత్తం 6 లేయర్లతో రెడీ చేశారట. ఇన్ని స్పేషాలిటీలు ఉన్న ఈ కేక్ ను ప్రియాంక నిక్ తమ పెళ్లి వేడుకల్లో కట్ చేశారు. ఈ కేక్ కు సంబంధించిన వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.