కాంగ్రెస్ కూటమికి 65 స్థానాలు వస్తాయి- లగడపాటి

తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని మిగిలిన ఎగ్జిట్ పోల్స్ చెబుతుంటే… లగడపాటి సర్వే మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

పోలింగ్ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన లగడపాటి…తెలంగాణలో మహాకూటమిదే పైచేయి అని చెప్పారు. కాంగ్రెస్‌ కూటమికి 65 స్థానాలు రావొచ్చునని చెప్పారు.

టీఆర్ఎస్‌కు 35 స్థానాలు వస్తాయన్నారు. ప్రలోభాలు పనిచేసి ఉంటే కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ సీట్ల సంఖ్యలో పది సీట్లు తగ్గొచ్చు… లేదా పెరగవచ్చు అని లగడపాటి చెప్పారు. టీడీపీ ఏడు స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు.

బీజేపీకి ఏడు, ఎంఐఎంకు ఏడు వస్తాయన్నారు. ప్రలోభాలు పనిచేశాయా లేదా అన్న దాని బట్టి టీడీపీ సీట్ల సంఖ్య రెండు పెరగడం లేదా రెండు తగ్గడం జరగవచ్చన్నారు. ఇండిపెండెంట్‌లు ఏడు స్థానాల్లో గెలుస్తుందని లగడపాటి చెప్పారు. తెలంగాణలో డబ్బు ప్రభావం ఉండదని భావించామని.. కానీ ఇక్కడ కూడా భారీగా డబ్బు ఖర్చు పెట్టారన్నారు.