వెన్నుపోటు పొడిచారు- టీజేఎస్‌ అభ్యర్థి ఆవేదన

ఎన్నికల్లో తనకు ఎదురైన అనుభవాలపై వరంగల్ జిల్లా వర్థన్నపేట మహాకూటమి అభ్యర్థి పగిడిపాటి దేవయ్య ఆవేదన చెందారు. తనను నమ్మినవాళ్లే మోసం చేశారని వ్యాఖ్యానించారు. ఇటీవల దేవయ్యకు చెందిన భారీ డబ్బును పోలీసులు పట్టుకున్నారు.

మీడియా ప్రతినిధులు ఈ అంశంపై దేవయ్యను ప్రశ్నించగా… తన ఆవేదన చెప్పుకున్నారు. నియోజకవర్గంలోని కొందరు స్వార్థపరులు మోసం చేశారని చెప్పారు. పక్కలో బల్లెంలా చేరి వెన్నుపోటు పొడిచారన్నారు. ముందు నుంచి ఒకరు, వెనుక నుంచి ఒకరు, పక్క నుంచి ఒకరు పోటు పొడిచారని వ్యాఖ్యానించారు.

మోసం చేశారని తెలుసు కానీ ఏం చేయగలం అని దేవయ్య నైరాశ్యం వ్యక్తం చేశారు. ఏం జరిగినా పాజిటివ్‌గా తీసుకుని వెళ్లాల్సిందేనన్నారు. ఏం జరిగినా పాజిటివ్‌గా ముందుకెళ్లడం తనకు అమెరికా నుంచే అలవాటు అయిందని దేవయ్య చెప్పారు. పగిడిపాటి దేవయ్య తరఫున ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రూ.3.3 కోట్లను ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.