“ఎన్టీఆర్” బయోపిక్ ఓపెనింగ్ సీన్ ఇదే

నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. స్వర్గీయా శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం “కథానాయకుడు” జనవరి 9 న రిలీజ్ అవుతుంటే, రెండో భాగం “మహానాయకుడు” ఫిబ్రవరి 7 న రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే “కథానాయకుడు” సినిమా ఓపెనింగ్ సీన్ చాలా ఎమోషనల్ గా స్టార్ట్ అవుతుంది అంట.

ఫిలిం నగర్ టాక్ ప్రకారం సినిమా స్టార్ట్ అవ్వడమే హాస్పిటల్ లో ఓపెన్ అవుతుంది అంట. హాస్పిటల్ లో బసతారకం కాన్సర్ తో పోరాడే సీన్ తో సినిమాని ఓపెన్ చేస్తాడట క్రిష్. అక్కడే హాస్పిటల్ చైర్ మీద కూలబడిపోయిన ఎన్టీఆర్ తను స్టార్ ఎలా అయ్యాడు అనే దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే టైటిల్ రోల్ అయ్యి అసలు కథలోకి వెళ్తుంది సినిమా. ఈ సీన్ తో సినిమా ఓపెన్ చెయ్యడం అనేది చాలా మంచి విషయం అని క్రిష్ భావించాడట. విద్య బాలన్ బసవతరకంగా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది నటించారు.