పెళ్లిపై విజయ్ దేవరకొండ రియాక్షన్

 హీరో విజయ్ దేవరకొండ మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. ఇప్పుడు మరోసారి తన పెళ్లిపై రియాక్ట్ అయ్యాడు. కాకినాడలో మంచి అమ్మాయి దొరికితే స్పాట్ లో పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.

ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ సినిమాకు సంబంధించి కాకినాడలో భారీ షెడ్యూల్ జరిగింది. దాదాపు నెల రోజుల పాటు కాకినాడలోనే షూట్ చేశారు. ఈరోజుతో సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ కు వచ్చాడు దేవరకొండ. ఈ సందర్భంగా కాకినాడలో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఈ సందర్భంగా పెళ్లిపై పైవిధంగా రియాక్ట్ అయ్యాడు ఈ హీరో.

పెళ్లి అనేది మనసుకు అనిపించాలని, అలా అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటానంటున్నాడు. మనసుకు అనిపించనప్పుడు 5-10 ఏళ్లు అలా గడిచిపోతుంటాయని తెలిపాడు. 2 ఏళ్ల తర్వాత చేసుకోవాలి, 3 ఏళ్ల తర్వాత చేసుకోవాలి లాంటి డెడ్ లైన్స్ ఏవీ పెట్టుకోలేదని స్పష్టంచేశాడు.