అంతేగా.. అన్ని కేంద్రాల్లో బ్రేక్-ఈవెన్

అంతేగా.. అంతేగా అంటూ నవ్వులు పూయించిన ఎఫ్2 సినిమా ఈ సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. వారం రోజులు కూడా కంప్లీట్ కాకుండానే ఈ సినిమా అన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్ అయిందంటే సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. ఓ మంచి హిట్ కోసం దాదాపు ఏడాదిగా వెయిట్ చేస్తున్న దిల్ రాజు… ఈ సినిమా సక్సెస్ తో పండగ చేసుకుంటున్నాడు.

నిన్నటితో 6 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ వసూళ్లలో ఇది ఇప్పటికే 50 కోట్ల మార్క్ టచ్ చేసింది. అటు ఓవర్సీస్ లో  త్వరలోనే ఈ సినిమా 2 మిలియన్ మార్క్ టచ్ చేయబోతోంది. ఈ ఏడాది ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ చేసిన మొట్టమొదటి సినిమాగా రికార్డు సృష్టించబోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ 6 రోజుల్లో ఎఫ్2 సినిమా వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 10.75 కోట్లు

సీడెడ్ – రూ. 4.08 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 3.94 కోట్లు

ఈస్ట్ – రూ. 3.70 కోట్లు

వెస్ట్ – రూ. 2.07 కోట్లు

గుంటూరు – రూ. 2.85 కోట్లు

కృష్ణా – రూ. 2.80 కోట్లు

నెల్లూరు – రూ. 1.02 కోట్లు