“బంగార్రాజు” సినిమాలో నాగ చైతన్య

అక్కినేని నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమా “సోగ్గాడే చిన్ని నాయన” ఇప్పుడు ఈ సినిమాకి ప్రిక్వెల్ గా “బంగార్రాజు” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.

“సోగ్గాడే చిన్ని నాయన” సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు అనే పాత్రకి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఆ సినిమా టైం లోనే ఈ సినిమాకి ప్రీక్వేల్ గా “బంగార్రాజు” అనే సినిమాని తెరకెక్కించబోతున్నట్టు డైరెక్టర్ ప్రకటించాడు. ఈ సినిమాలో నాగార్జున బంగార్రాజు పాత్రలో నటించనున్నాడు.

ఇక బంగార్రాజు కి మనవాడి పాత్రలో నాగ చైతన్య నటించబోతున్నాడట. వీళ్ళిద్దరి మధ్య జరిగే కథే “బంగార్రాజు” సినిమా. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక శర్మ నటించనుంది. ఈ భామ ఇదివరకు కళ్యాణ్ క్రిష్ణ కురసాల, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన “నేల టిక్కెట్” సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఫ్లాప్ తరువాత ఈ హీరోయిన్ కి అసలు అవకాశాలే లేవు. మళ్ళీ కళ్యాణ్ క్రిష్ణ  “బంగార్రాజు” సినిమాలో ఈ హీరోయిన్ కి అవకాశం ఇస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.