పోర్న్ స్టార్ గా రమ్య క్రిష్ణ

“బాహుబలి” సినిమాలో శివగామి గా నటించి తన నట విశ్వరూపాన్ని చూపించింది రమ్యక్రిష్ణ. ఆ సినిమా తరువాత రమ్యక్రిష్ణ కి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం తమిళ్ లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది రమ్యక్రిష్ణ. జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో షూటింగ్ కి వెళ్లనుంది.

ఇక ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ పోర్న్ స్టార్ గా నటిస్తోంది. అవును “సూపర్ డీలక్స్” అనే తమిళ చిత్రంలో పోర్న్ స్టార్ గా నటించడానికి ఒప్పుకుందట రమ్యక్రిష్ణ. గ్లామర్ నటిగానే కాకుండా అద్భుతమైన నటన తో కూడా ఆకట్టుకున్న రమ్యక్రిష్ణ ఈ సినిమాలో ఒక పోర్న్ స్టార్ పాత్రలో నటిస్తోంది.

కథలో భాగంగా వచ్చే “మల్లు కట్” అనే మలయాళ భూతు సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది రమ్యక్రిష్ణ. ఈ పాత్ర కథకే హై లైట్ గా ఉండనుందట. విజయ్ సేతుపతి హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో సమంతా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తమిళ్ లో త్వరలో రిలీజ్ కానుంది.  మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక రమ్యక్రిష్ణ పాత్ర ఎన్ని సంచలనాలకి దారి తీస్తుందో చూడాలి.