బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో “ఆర్‌ ఎక్స్‌100” దర్శకుడు

“ఆర్‌ ఎక్స్‌100″….సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అందరికి తెలిసిన విషయమే. విషాదమైన లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అజయ్ భూపతికి తెలుగు లో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

అయితే ఇప్పుడు యంగ్ హీరో రామ్ అజయ్ భూపతిని కథ రెడీ చేయమని చెప్పాడట. ఇక అజయ భూపతి కూడా “ఆర్‌ ఎక్స్‌100” హిట్ ఇచ్చిన జోష్ తో అతి తక్కువ టైం లోనే హీరో రామ్ కోసం అధ్బుతమైన కథని రెడీ చేసుకొని తీసుకొచ్చాడు. కానీ రామ్ కి కథ నచ్చకపోవడం తో కథలో కొన్ని మార్పులు చెప్పాడు. ఆ మార్పులు చెయ్యడం ఇష్టం లేదని రామ్ కి చెప్పాడట. ఇక ఆ విషయం లో ఇద్దరికీ మాట మాట పెరిగింది.

ఇక వెంటనే చేసేది లేక అజయ్ భూపతి సినిమాని పక్కన పెట్టేసి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో “ఈస్మార్ట్ శంకర్” సినిమాని స్టార్ట్ చేసాడు. దీంతో అజయ్ భూపతి కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ప్రస్తుతం ఈ హాట్ దర్శకుడు ఇదే కథని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి చెప్పాడట. కథ విపరీతంగా నచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వెంటనే ఈ హిట్ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు.