రామ్ చరణ్ కి ఆ నిర్మాత బెస్ట్ ఫ్రెండ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇండస్ట్రీ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే శర్వానంద్, రానా, ఎన్టీఆర్ లు అని చెప్తారు అందరూ. కానీ వీళ్ళకంటే కూడా బెస్ట్ ఫ్రెండ్ ఇంకొకతను ఉన్నాడు. అతనే విక్రం రెడ్డి….రామ్ చరణ్ కి బెస్ట్ ఫ్రెండ్. విక్రం రెడ్డి అంటే ఎవరో కాదు ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ లో ఒక నిర్మాత. ఈ నిర్మాత రామ్ చరణ్ కి చాలా క్లోజ్ గా ఉంటాడట.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ విక్రం రెడ్డి గురించి మాట్లాడుతూ “నేను ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా బెస్ట్ ఫ్రెండ్ విక్రం రెడ్డి కి కాల్ చేస్తాను, నా స్పీడ్ డయల్ లో ఎప్పుడు విక్రం రెడ్డి నెంబర్ ఉంటుంది. నేను బాధలో ఉన్నా కూడా విక్కి కే కాల్ చేస్తాను” అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ మాటలు బట్టి చూస్తుంటే విక్రం రెడ్డి రామ్ చరణ్ కి ఏ రేంజ్ లో ప్రాణ స్నేహితుడు అనేది అర్ధం అవుతుంది. త్వరలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.