వెంకీ అట్లూరి కి మరో ఛాన్స్ ఇచ్చిన అఖిల్

అక్కినేని హీరో అఖిల్  తన మూడో సినిమా అయిన “మిస్టర్ మజ్ను” తో బిజీగా ఉన్నాడు. “తొలిప్రేమ” ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని జనవరి 25 న రిలీజ్ కి రెడి అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వకముందే వెంకీ అట్లూరి కి మరో అవకాశం ఇచ్చాడు అఖిల్. అవును వెంకీ అట్లూరి తన తదుపరి సినిమాని కూడా అఖిల్ తోనే చేయబోతున్నాడు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

సాధారణంగా ఇండస్ట్రీ లో ఏదైనా డైరెక్టర్ కి మంచి పేరు ఉంది అని తెలియగానే మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వెంకీ అట్లూరికి అడ్వాన్స్ ఇచ్చి వెంకీ డేట్స్ ని తీసుకున్నారు. ఇక వీళ్ళ దగ్గర అక్కినేని అఖిల్ డేట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది అని గట్టి నమ్మకం చాలా మందిలో ఉంది.

అసలు “మిస్టర్ మజ్ను” రిలీజ్  అవ్వలేదు అప్పు డే అఖిల్ వెంకీ తో మరో సినిమా ఒప్పుకోవడం ఏంటి అని అనే వారు కూడా ఉన్నారు. ఏదేమైనా గాని వెంకీ తదుపరి సినిమా ఏంటి అనేది “మిస్టర్ మజ్ను” రిజల్ట్ బట్టి ఉంటుంది.