గల్ఫ్ లో షూటింగ్ చేయనున్న ‘మహర్షి’

ఈ మధ్యనే ‘భరత్ అనే నేను’ సినిమా తో మర్చిపోలేని హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా అయిన ‘మహర్షి’ తో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి మొదటి వారం నుండి హైదరాబాద్ లో మరో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ మొదలవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ గల్ఫ్ దేశంలో జరగనుందట.

‘మహర్షి’ ఆఖరి షెడ్యూల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ అయిన అబుదాబిలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఫిబ్రవరి ఆఖరి వారం కల్లా పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తో ‘మహర్షి’ సినిమా షూటింగ్ పూర్తయినట్టే. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 4వ తారీఖున ఈ సినిమా టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.