“మన్మధుడు 2” షూటింగ్ పోర్చుగల్ లో స్టార్ట్ కానుంది

 అక్కినేని నాగార్జున కెరీర్ లో “మన్మధుడు” సినిమాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా “మన్మధుడు” మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా కామెడీ మాత్రం ఇప్పటి తరం ప్రేక్షకులకి కూడా ఫేవరెట్ గా ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది. హీరో నుంచి డైరెక్టర్ గా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.

“చి.లా.సౌ” సినిమాతో డీసెంట్ హిట్ ని అందుకున్న రాహుల్ కి అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో “మన్మధుడు” సినిమా కి సీక్వెల్ వస్తుంది అని తెలియగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

“మన్మధుడు” సినిమా కథ పారిస్ లో కొంత భాగం జరిగితే ఇప్పుడు ఈ రెండో భాగం షూటింగ్ పోర్చుగల్ లో ప్లాన్ చేసాడట రాహుల్ రవీంద్రన్. ఇప్పటికే కథ రెడీ చేసి కాన్ఫిడెంట్ గా ఉన్న రాహుల్ రవీంద్రన్ ప్రేక్షకుల అంచనాల్ని అందుకుంటాడో లేదో చూడాలి. త్వరలో అధికారిక ప్రకటన చేసుకోబోతున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున ప్రొడ్యూస్ చేస్తున్నాడు.