ఆగిపోయిన మహేష్ బాబు అల్లుడి సినిమా ?

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే సుధీర్ బాబు, నవీన్ క్రిష్ణ హీరోలుగా వచ్చారు. అయితే నవీన్ క్రిష్ణ ఇంకా హీరో గా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా…. సుధీర్ బాబు మాత్రం హీరో గా సెటిల్ అయ్యి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఇక ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరోగా మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అయిన గల్లా అశోక్ కూడా రానున్నాడు. గల్లా అశోక్  హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా స్టార్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే.

షార్ట్ ఫిలిం మేకర్ అయిన ససి కుమార్ ముత్తులూరి ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. కారణం ఇప్పటి వరకు పూర్తి స్థాయి స్క్రిప్ట్ లేకపోవడమేనట.

గల్లా అశోక్ ఒక రెండు టర్కిష్ సినిమాల్ని తెచ్చి రీమేక్ చేద్దాం అని చెప్పి దిల్ రాజుతో చెప్పాడట. దిల్ రాజు కూడా ఆ సినిమాలని రీమేక్ చేద్దాం అనే ఉద్దేశం తో సినిమాలు చూశాడట. కానీ ఆ సినిమాలకు దిల్ రాజు కనెక్ట్ కాలేకపోయాడు. ఇక దిల్ రాజు చేసేది లేక శశి కుమార్ తో ఒక కథ రెడీ చేయించుకుంటున్నాడట.