మాటలతో సూపర్ స్టార్ ని పడేసిన అనిల్ రావిపూడి ?

సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చెయ్యాలి అని ప్రతి ఒక్క తెలుగు దర్శకుడికి ఉంటుంది. ఈ క్రమంలో ఆ డైరెక్టర్స్ మహేష్ బాబుకి అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ కి బట్టర్ పూయడానికి కూడా రెడీ గా ఉంటారు.

ఇక ఇప్పుడు “ఎఫ్ 2” సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకన్న అనిల్ రావిపూడి కూడా అదే చేస్తున్నాడు అని ఇండస్ట్రీ టాక్. ఇటీవలే పలు ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబుని తెగ పొగిడేసాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి అనిల్ రావిపూడి పై ప్రస్తుతం పాజిటివ్ గా ఉన్నారు.

అయితే ఇలాంటి నేపధ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి ఓకే అన్నాడు అనే టాక్ వినిపిస్తుంది. కానీ అసలు మహేష్ బాబుని ఇది వరకు కూడా చాలా మంది దర్శకులు పొగిడారు, మరి ఎందుకు మహేష్ బాబు మాత్రం అని రావిపూడి కే అవకాశం ఇచ్చాడు ? అయినా ఇవన్ని అధికారికంగా ప్రకటించినప్పుడు చూద్దాం అన్నవారు లేకపోలేదు.

ఎందుకంటే మహేష్ బాబు ప్రస్తుతం “మహర్షి” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయాక సుకుమార్ సినిమాతో పాటు రాజమౌళి సినిమా కూడా ఉంటుంది. ఈ రెండు సినిమాల మధ్యలో సందీప్ రెడ్డి వంగా సినిమా కూడా ఉంటుంది.