ఎఫ్2.. వరల్డ్ వైడ్ రూ.100 కోట్లు

  ఎఫ్2 సినిమా వరల్డ్ వైడ్ దుమ్ముదులుపుతోంది. నిన్నటితో 10 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక షేర్ విషయానికొస్తే.. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 67 కోట్ల రూపాయల షేర్ రాగా… తెలుగు రాష్ట్రాల్లో 47 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

మరో 2 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల మార్క్ అందుకోబోతోంది. అటు వెంకటేష్, ఇటు వరుణ్ తేజ్ కెరీర్ లో తొలి 50 కోట్ల సినిమాగా అవతరించబోతోంది. ఇక ఏపీ, నైజాంలో ఈ సినిమాకు 10 రోజుల్లో వచ్చిన షేర్ ఇలా ఉంది.

ఏపీ, నైజాం 10 రోజుల షేర్

 నైజాం  – రూ. 16.07 కోట్లు

సీడెడ్ – రూ. 6.10 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 6.93 కోట్లు

ఈస్ట్ – రూ. 5.44 కోట్లు

వెస్ట్ – రూ. 3.06 కోట్లు

గుంటూరు – రూ. 4.05 కోట్లు

కృష్ణా – రూ. 3.97 కోట్లు

నెల్లూరు – రూ. 1.48 కోట్లు