కీలక ఎపిసోడ్ షూటింగ్ లో “ఎన్టీఆర్” సెకండ్ పార్ట్

నందమూరి బాలక్రిష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన “ఎన్టీఆర్” బయోపిక్ పై రిలీజ్ కి ముందు వరకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఫ్లాప్ అయ్యి ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేక పోయింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం అయిన మహానాయకుడు పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు బాలక్రిష్ణ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

అక్కడే బాలక్రిష్ణ, కళ్యాణ్ రామ్ ల పై చైతన్యరథం సన్నివేశాలు షూట్ చేస్తున్నాడు క్రిష్. ఎన్టీఆర్ జీవితంలో చైతన్య రథం చాలా ముఖ్య పాత్ర పోషించింది. అసలు అప్పట్లోనే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కేవలం తన కొడుకు హరిక్రిష్ణ ని అలాగే కొంత మంది కార్యకర్తలని మాత్రమే వెంట తీసుకొని ప్రజల దగ్గరకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు ఎన్టీఆర్.

మరి అలాంటి ఈ ఎపిసోడ్ ని క్రిష్ ఎలా డైరెక్ట్ చేస్తున్నాడు అసలు నందమూరి బాలక్రిష్ణ ఈ ఎపిసోడ్ లో ఎలా నటించబోతున్నాడు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండో భాగం అయిన మహానాయకుడు ఫిబ్రవరి 14 న రిలీజ్ కాబోతుంది.