మేడాపై సస్పెన్షన్‌ వేటు… జగన్‌తో భేటీ

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిపై ఆ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేశారు. టీడీపీలో ఉంటూ ఇటీవల వైసీపీ నేతలను మేడా కలవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.

రాజంపేట నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో మేడా అంశం ప్రస్తావనకు వచ్చింది. మేడాపై వేటు వేయాలని పార్టీ నేతలు కోరారు. దీంతో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు చంద్రబాబు కూడా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకు మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్‌ జగన్‌ను కలవనున్నారు. లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆయన టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నారు.