“యాత్ర” సినిమాలో వై.ఎస్ జగన్ ? 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా “యాత్ర. వైఎస్ గా మమ్ముట్టి నటిస్తున్న ఈ సినిమాని మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రని ఎవరు పోషిస్తున్నారు అని చాలా మంది అనుకున్నారు. కానీ వై ఎస్ జగన్ పాత్రని వైఎస్ జగనే పోషిస్తున్నాడు.

ప్రస్తుతం  రాజకీయాలతో బిజీగా ఉండే వైఎస్ జగన్ ఈ సినిమాలో అసలు ఎప్పుడు నటించారో అని అనుకోకండి, ఎందుకంటే ఈ సినిమాలో వైఎస్ జగన్ వీడియో ఫూటేజి మాత్రమే వాడుతున్నారు మూవీ యూనిట్. అవును ఈ సినిమా క్లైమాక్స్‌లో రియల్ ఫుటేజీ ప్రదర్శించబోతున్నారట టీం.

“యాత్ర” సినిమా పూర్తిగా 2004లో వైఎస్ చేసిన పాద యాత్ర నేపథ్యంలో సాగినప్పటికీ క్లైమాక్స్‌లో 20 నిమిషాల పాటు వైఎస్ఆర్ మరణం, ఇడుపులపాయలో జరిగిన అంత్యక్రియలు చూపించబోతున్నట్లు టాక్. సినిమా చివర్లో వచ్చే ఈ వీడియో ప్రేక్షకులని ఎమోషనల్ చెయ్యడం ఖాయం అని టీం భావిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 7 న రిలీజ్ కానుంది.