డబ్బులు వెనక్కి ఇచ్చేసిన దానయ్య

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన “వినయ విధేయ రామ” రిలీజ్ అయ్యి ఫ్లాప్ నుంచి డిసాస్టర్ దిశగా దూసుకుపోతుంది.

ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అరవై కోట్లకి పైగా షేర్ ని వసూలు చేసింది. కానీ ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోయాయి.

రామ్ చరణ్ కెరీర్ లో “రంగస్థలం” సినిమా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తే “వినయ విధేయ రామ” మాత్రం భారీ డిజాస్టర్ గా మారి అసలు సినిమాకి కలెక్షన్స్ లేకుండా చేసింది. రిలీజ్ కి ముందు ఈ సినిమా హైప్ ని దృష్టిలో ఉంచుకొని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి భారీగా వసూలు చేసిన డి.వి.వి దానయ్య ఇప్పుడు కొంత డబ్బు వెనక్కి ఇచ్చేసాడట.

ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి దానయ్య 50 లక్షలు వరకు రిటర్న్ ఇచ్చాడట. ఇక ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఎంతో కొంత డబ్బు రిటర్న్ ఇవ్వాలని దానయ్య డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం దానయ్య రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా వస్తున్న “ఆర్.ఆర్.ఆర్” సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.