ఇలియానాతో ముద్దు సీన్ లో నటిస్తానంటున్న యంగ్ హీరో !

గోవా బ్యూటీ ఇలియానా గత కొన్నేళ్ళ క్రితం తెలుగులో తన హవాని కొనసాగించి…. ప్రస్తుతం బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పాగా వేసింది. కానీ ఇలియానాకి తెలుగు లో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. ఇలియానా కోసం ప్రొడ్యూసర్స్ సినిమా తీయడానికి రెడీ గా ఉన్నారు. కాకపోతే ఇలియానా రీ ఎంట్ర్రీ సినిమాగా వచ్చిన “అమర్ అక్బర్ ఆంటోనీ” మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే “ఆర్ ఎక్స్ 100” సినిమాతో హీరోగా ఆకట్టుకున్న కార్తికేయకి ఇలియానా అంటే చాలా ఇష్టమట. చిన్నప్పటి నుంచి ఇలియానా సినిమాలు చూస్తూ పెరిగిన కార్తికేయ ఇలియానాకి పెద్ద ఫ్యానట.

అందుకే ఛాన్స్ దొరికితే ఇలియానా తో లిప్ లాక్ చేయాలి అనుకుంటున్నట్టు ఈ హీరో చెప్పాడు. అయితే ప్రస్తుతం ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ అండ్రూ తో సహజీవనం చేస్తోంది.